విద్యా నిధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము – ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల ఆధ్వర్యములో నడిచే విద్యా సంస్థల బలోపేతానికి మరియు విద్యా సంస్థలలో ప్రజా భాగస్వామ్యం పెంచడానికి చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఎవరైనా దాతలు స్థలము / భవన నిర్మాణము / ధన రూపేణా పాఠశాలలకు డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లయితే దాత పేరున లేదా వారు సూచించిన పేరు సదరు పాఠశాల నామకరణములో చేర్చబడుతుంది.
ప్రాధమిక పాఠశాలకు కనీసం రూ. 5 లక్షలు
ప్రాధమికోన్నత పాఠశాలకు కనీసం రూ. 7.50 లక్షలు
ఉన్నత పాఠశాలకు కనీసం రూ. 10 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాకు జమచేయవలసి ఉంటుంది.
దాతలు ఇచ్చిన మొత్తాన్ని భవన నిర్మాణానికి, ప్రహారీ నిర్మాణానికి, మరమ్మతులకు లేదా దాత మరియు ప్రభుత్వము అంగీకరించిన పనులు చేపట్టుటకు ఉపయోగిస్తారు.
మరిన్ని వివరాలకు మీ దగ్గరలో గల మండల విద్యా శాఖాధికారి వారిని లేదా ఉప విద్యాశాఖాధికారి వారిని లేదా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో అన్ని పనిదినములలో సంప్ర్రదించ వచ్చును.
సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి